Turkey మరోసారి టర్కీపై విరుచుకుపడ్డ భారీ భూకంపం.. ముగ్గురు మృతి.. 200 మందికిపైగా గాయాలు

Facebook
Twitter
LinkedIn

Table of Contents

Earthquake రెండు వారాల కిందట సంభవించిన శక్తివంతమైన భూకంపం.. వేలాది మంది ప్రాణాలను తీసింది. టర్కీ, సిరియాలో విషాదం మిగిల్చిన ఈ భూకంపం కారణంగా దాదాపు 50 వేల మంది చనిపోగా.. రెండు లక్షల మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే మరోసారి రెండు భూకంపాలు సంభవించడంతో జనం వణికిపోతున్నారు. ఫిబ్రవరి 6 న భూకంపం సంభవించిన తర్వాత ఏకంగా 6 వేలసార్లు భూమి కంపించడం మరో భయానక విషయం.

రెండు వారాల కిందట సంభవించిన భారీ భూకంపం (Earthquake)ధాటికి అతలాకుతలమైన తుర్కియే (Turkey) లోని.. సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. హతాయ్‌ ప్రావిన్సులో (Hatay) సోమవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. భూకంప కేంద్రం దక్షిణ టర్కీ నగరం అంటాక్యా (Antakya) సమీపంలోని 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం సిరియా, ఈజిప్టు, లెబనాన్‌‌లోనూ కనిపించింది. తాజా భూకంపం కారణంగా ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయి.

హతాయే మేయర్ లుత్‌ఫు సవస్ మాట్లాడుతూ… ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయి శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు నివేదికలు అందాయన్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 200 మంది గాయపడ్డారని టర్కీ హోంశాఖ మంత్రి సులేమాన్ సోయ్‌లూ చెప్పారు. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఒకరు మాత్రమే చనిపోయారని, చాలా భవనాలు కూలిపోయినట్టు స్థానికులు చెప్పినా రెండు వారాల కిందట సంభవించిన భూకంపం తర్వాత భయంతో పట్టణవాసులు వేరే చోటకు వెళ్లిపోయారని చెప్పింది.
భూమి మళ్లీ కంపించడం మొదలైనప్పుడు నా కాళ్ల కిం భూమి చీలిపోతుందని నేను అనుకున్నాను అని సెంట్రల్ అంటాక్యాకు చెందిన మునా అల్ ఒమర్ అనే ఓ మహిళ కన్నీరుపెట్టుకుంది. ఓ పార్కులో టెంట్ వేసుకుని తన ఏడేళ్ల కుమారుడితో బిక్కుబిక్కుమని గడుపుతోంది. ఇక, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో 47 వేల మందికిపైగా మృతిచెందారు. ఒక్క టర్కీలో 41,156 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది గాయపడ్డారు. 3,85,000 భవనాలు కూలిపోయాయి.
భూకంపంతో అతలాకుతలమైన టర్కీకి ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సహాయక చర్యల కోసం బలగాలను పంపి.. సామాగ్రిని కూడా అందజేస్తున్నాయి. భారత్ నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు, NDRF టీమ్స్‌ టర్కీలోని దక్షిణ ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కాగా, భూకంపం బాధితుల్లో 3,56,000 మంది గర్భిణిలు ఉన్నారని, వారికి అత్యవసర వైద్య సేవలు అందజేయాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి లింగ, పునరుత్పత్తి ఆరోగ్య విభాగం పేర్కొంది.
టర్కీలో 226,000, సిరియాలో 130,000 మంది గర్భిణీలు ఉండగా.. వీరిలో 38,800 మందికి వచ్చే నెలలో ప్రసవాలు జరగనున్నాయి. చాలా మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఓవైపు శీతల వాతావరణం.. మరోవైపు సరైన ఆహారం, తాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.  Know More

Related

MagicAI And 101 Diverse AI Alternatives For Pictures

MagicAI And 101 Diverse AI Alternatives For Pictures

What does MagicAI specialize in? MagicAI specializes in AI-powered generation of images and videos. What type of digital artwork can I create with MagicAI? With MagicAI, you can create a wide range of digital artwork including AI art, posters, and anime art. Who is MagicAI suitable for? MagicAI is suitable for both novice users and

Read More »
‘The Buckingham Murders’ film overview: Kareena Kapoor Khan mothers this socially-pertinent whodunit

‘The Buckingham Murders’ film overview: Kareena Kapoor Khan mothers this socially-pertinent whodunit

A still from ‘The Buckingham Murders’ An intriguing murder mystery layered with apposite social commentary, The Buckingham Murders (TBM) is a fast-paced thriller that makes us reflect on the social churn. Fuelled by the powerhouse talent of Kareena Kapoor Khan and fine-tuned by writer-director Hansal Mehta’s empathetic gaze, the film genuinely attempts to understand the social outcasts

Read More »
×